Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పిల్లికి కూడా బిక్షం వేయ లేని స్వభావం ఎమ్మెల్యే ది

అవినీతి అక్రమాలకు అడ్డ ఎమ్మెల్యే కుటుంబం

విశాలాంధ్ర= పెనుకొండ : పెనుకొండ పట్టణమునందు శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయు ల సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అనుచరులు స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవితమ్మ మీద లేనిపోని ఆరోపణలు చేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాల గురించి ఆయన చేస్తున్న పనుల గురించి తెలియజేశారు సవితమ్మ నిత్యం ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు ,నాయకులకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తున్న సవితమ్మను విమర్శించేది మీరా నియోజకవర్గం లో ఎంతోమందికి నిత్యం ప్రజలకు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన తన వంతు సహాయంగా చేస్తూ వేసవికాలంలో తాగునీటి సరఫరా కరోనా సమయంలో ఆహార ధాన్యాలు గర్భవతులకు అన్నదాన కార్యక్రమం రంజాన్ సందర్భంగా బీద ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేయడం విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించడం మా యొక్క నేత సహాయం చేయడంలో ఆమెకు సాటి ఎవరూ రారని ఎమ్మెల్యే శంకర్నారాయణ పిల్లికి కూడా బిక్షం వేయలేని స్వభావం
మా తెలుగుదేశం పార్టీలో వెన్నుపోటు ఉందని అంటున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు నాయకులకు ఒకరంటే ఒకరు పోటీపడి సహాయం చేస్తున్నారు, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు, చివరగా ఎవరు చేసిన పార్టీ కోసం కృషి చేస్తున్నారు, దాన్ని వెన్నుపోటు అంటారా
వెన్నుపోటు అంటే ఓట్లు వేసి గెలిపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత వైసిపి కార్యకర్తలు మీద నాయకులు మీద కేసులు పెట్టించి జైలుకు పంపించిన చరిత్ర మీ పార్టీలో మీ నాయకుడిది, దాన్ని వెన్నుపోటు అంటారు.
రైల్వే కాంట్రాక్టర్లపనుల్లో మరియు కర్ణాటక డీజిల్ అక్రమ వ్యాపారం చేస్తోందని కోట్ల రూపాయలు ప్రజాధనం దోపిడీ చేసిందని మీరు మాట్లాడుతున్నారు మీకు చేతనైతే గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో మీ వైసీపీ ప్రభుత్వం ఉంది , మీకు చేతనైతే నిరూపించండి, అంతేకానీ లేనిపోని విమర్శలు చేసి నవ్వుల పాలు కాకండి..
మీకు చేతనైతే నా వ్యాపారాలు మీద మీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారి ఆస్తులపైన బినామీ ఆస్తులపైన చర్చకు సిద్ధమని సవాల్ విసిరింది. దానికి కట్టుబడి ఉంటారా మీ నాయకుడు….
మీకు కూడా సవితమ్మ ను విమర్శలు చేసే వారు కాదని శాసనసభ్యులు మరియు వారి సోదరులు ఒత్తిడితో ప్రకటన చేస్తున్నారు, తప్ప, మీరు కూడా అతని చేతిలో కీలుబొమ్మలు కాకండి అంటూ వైసీపీ నాయకుల విమర్శకు ప్రతి విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ నాయుడు సూర్యనారాయణ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు, మావ టూరు గోపాల్, కౌన్సిలర్ గీతా హనుమంతు,మారుతి బాబుల్ రెడ్డి వాసుదేవరెడ్డి, బాలాజీ నాయక్, వెంకటేష్ , శెట్టిపల్లి మంజు,,పాపన్న మరియు ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img