Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : స్థానిక ఆర్ డి ఒ కార్యాలయము నందు పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై డివిజనల్ స్థాయి సమీక్షా సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు . ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఒకరు, ఇద్దరు ఆడ పిల్లలు కలిగి వున్న కుటుంబ సభ్యులకు, తల్లి దండ్రులకు మండల స్థాయి గ్రామ స్థాయి పీసీ పి ఎన్ డి టి యాక్ట్ కమిటీ సభ్యుల మరియు ఆరోగ్య సిబ్బంది ద్వారా బాలికా ప్రాముఖ్యత ను ప్రజలకు వివరించి బాలికా సంతతిని కాపాడాలని తెలిపారు.అదే విధంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగ మందుల దుకాణాల్లో గర్భ స్రావం మాత్రల అమ్మకం డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించడం మీద పూర్తి ఆంక్షలు విధించామని జిల్లా ఔషద నియంత్రణ అదికారి హనుమన్న పేర్కొన్నారు. డాక్టరు సలహా లేకుండా స్వతహాగా అబార్షన్ మాత్రల వాడకం వల్ల తల్లి కి కూడా ప్రాణాంతకం కావచ్చు అని అన్నారు. బాలికా సంరక్షణ కు పాఠశాల లు మరియు కళాశాల ల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. అబార్షన్ల కట్టడి కి తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశం నకు హాజరైన సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఒ విశ్వనాధ్,డా.మనోజ్ ,పబ్లిక్ ప్రొసీక్యూటర్ హరినాథ్ రెడ్డి, ఆర్ డి టి హెల్త్ డైరెక్టర్ సిర్రెప్ప, రెడ్స్ సంస్థ లీగల్ అడ్వైజర్ శిరీష, హెడ్స్ విజయకుమార్, గైనకాలజిస్ట్ డా. విజయలక్ష్మి,పీడియట్రిషన్ డా. సుహాసిని,రేడియోలాజి డా సురేష్ టూ టౌన్ సీఐ శివరాం, ఐసీడీస్ లీగల్ అడ్వైసర్ సంధ్యా రాణి,డిప్యూటీ డెమో త్యాగరాజు, వేణు లీగల్ అడ్వైసర్ ఆశరాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img