Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రంగోళీ ముగ్గుల పోటీలు.

విశాలాంధ్ర -జె ఎన్ టి యు ఏ: పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల లో సంక్రాంతిను పురస్కరించుకొని శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పీవీకేకే ఇంజినీరింగ్ అన్ని విభాగాల విధ్యార్థులు ఆసక్తిగా పాల్గొని, సాధారణ ముగ్గులే కాకుండా ముగ్గుల్లో కూడా ఎన్నో సందేశాత్మ, పర్యావరణహితమైన మరియు రసాయన రహిత ముగ్గులు వేసి వీక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సంధర్భంగా కళాశాల చైర్మన్ పల్లె కిషోర్ మాట్లాడుతూ ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాంతి ముగ్గులను బంతి పూల రేకులతోను, గొబ్బెమ్మ లతోను అలంకరిస్తారు. నిత్యజీవితం లోని ప్రతి అంశాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దటటం మన భారతీయుల విశిష్టత. అందుకే ముగ్గు చల్లటాన్ని కూడా అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా మలచారు. అంతే కాకుండా పిండితో ముగ్గులు వేసి చీమలకు ఆహారం అందజేయటం కూడా సనాతన సంప్రదాయమని, మన భారతీయ ప్రాచీన సాంప్రదాయాలను గౌరవించాలని, మనదేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలని , పెద్దలను గౌరవించాలని విధ్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో కళాశాల కోశాధికారి పల్లె సింధూర, కళాశాల ప్రిన్సిపాల్ డా.బండి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా,రాఘవేంద్ర ప్రసాద్, ఏ ఓ మనోహర్ రెడ్డి, ఎం బీ ఏ అధ్యాపకులు దీపిక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img