Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పురవీధుల్లో ఊరేగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి

విశాలాంధ్ర – ధర్మవరం : ముక్కోటి ఏకాదశి వేడుకలు ముగిసిన తర్వాత బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉదయం శ్రీవారి గరుడోత్సవాన్ని చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య, భక్తులు, సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత అర్చకులు కోనేరా చార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్లు గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను అమర్చి, వివిధ పూలమాలలతో చక్కగా అలంకరించిన పిదప, వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీవారి గరుడోత్సవమునకు ఉభయ దాతలుగా కీర్తిశేషులు మోకా చిన్న వెంకటసుబ్బయ్య మనవడు ఎం. రాఘవేంద్ర రవితేజ- హైదరాబాద్ వారు వ్యవహరించారు. అనంతరం స్వామి వారిని పట్టణ పురవీధులలో సాంప్రదాయ పద్ధతిలో ఊరేగించారు. వందలాదిమంది భక్తాదులు తమ తమ వీధుల యందు స్వామివారిని దర్శించుకునీ, పూజలు చేశారు. ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం ఉత్సవ వేడుకలు:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాత్రి 11 గంటలకు ఆలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల నడుమ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవ ఉభయ దాతలుగా దాశెట్టి పద్మావతి దాశెట్టి సుబ్రహ్మణ్యం లు వ్యవహరించారు. ఈ కళ్యాణ వేడుక కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం తీర్థ ప్రసాదాల నడుమ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశులు చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య ,సభ్యులు జగ్గా జయలక్ష్మి, సరస సౌందర్యల హరి, గిర్రాజు మహాలక్ష్మి, సత్రశాల సత్యనారాయణ, పురాళ్ల పద్మావతి, దాడి తోట సునీతతో పాటు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img