Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెట్రోల్ బంకుల్లో కల్తీని నివారిస్తాం.. జిల్లా పౌర సరఫరాల అధికారి వంశీకృష్ణ రెడ్డి

విశాలాంధ్ర-ధర్మవరం : ఏపీ ప్రభుత్వ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఇకనుండి జిల్లాలో జరుగుతున్న పెట్రోల్ బంకులలో కల్తీని పూర్తి దశలో నివారించడం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వంశీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం పట్టణంలోని పోతుకుంట రోడ్డులో గల లక్ష్మి పుయుల్స్ పెట్రోల్ బంక్ లో శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన”ఏపీ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్”అనే నూతన యాప్ను వారు ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్ పై శిక్షణ కొరకు సత్యసాయి జిల్లాలోని రెవెన్యూ విభాగానికి చెందిన సిఎస్డిటిలకు శిక్షణను ధర్మవరం సి ఎస్ టి టి చెన్నకేశవ నాయుడు ఇవ్వడం జరిగింది. అనంతరం వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ మొబైల్ యాప్ లో పొందుపరిచాల్సిన అన్ని విషయాలను వివరించడం జరిగిందని, ఇటీవల జిల్లాలలో కల్తీమయం అధికం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇకనుండి జిల్లాలో గల ఆర్డీవోలు, తహసీల్దార్లు తప్పనిసరిగా ప్రతినెల రెండు పెట్రోల్ బంకులు ఆకస్మిక తనిఖీ చేసి ఈ మొబైల్ యాప్ లో అన్ని వివరాలను పొందపరచడం జరుగుతుందన్నారు. కల్తీ అని ఏదేని పెట్రోల్ బంక్ లో తేలితే అప్పటికప్పుడే ఆ మొబైల్ యాప్ లో ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందన్న సమాచారాన్ని కూడా తెలియజేస్తూ, కఠిన చర్యలు కూడా తీసుకోబడుతుందని తెలిపారు. పెట్రోల్ బంకులో మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని, ప్రజల ద్వారా కూడా ఫిర్యాదులను సేకరించి, వెనువెంటనే చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. ప్రతి పెట్రోల్ బంకులో లోటుపాట్లను గుర్తించి, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ఇకనుంచి కల్తీకి అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. ఇప్పటివరకు తాను జిల్లాలోని 31 పెట్రోల్ బంకులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రజల ద్వారా కూడా నేరుగా ఫిర్యాదులను అందుకుంటామని, సెల్ నెంబర్ 8247475079 కు సమాచారమును అందిస్తే, వెనువెంటనే చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సి ఎస్ డి టి చెన్నకేశవ నాయుడు, ఏ ఎస్ ఓ సింధు, జిల్లాలోని రెవెన్యూ సి ఎస్ డి టి లు, స్థానిక పెట్రోల్ బంక్ ప్రోప్రైటర్ కీర్తి చౌదరి, మేనేజర్ రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img