Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదలకు సేవ చేయుట మా కర్తవ్యం.. యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు

విశాలాంధ్ర – ధర్మవరం : పేదలకు సేవ చేయుటయే మా కర్తవ్యమని యువర్ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వై కే శ్రీనివాసులు,సుంకు సుకుమార్ ,ఉపాధ్యక్షులు చాంద్ బాషా, కోశాధికారి రాధాకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా యువర్ ఫౌండేషన్ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విశేష సేవలు అందించిన వారిని, నూతన కమిటీలో చేరిన వారందరినీ కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యువర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ 2015లో ఏర్పడిందని, నేటికీ ఎనిమిదవ వార్షికోత్సవమును నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నేత్రదానం ను స్వీకరించుటలో ఉమ్మడి జిల్లాలలోనే అత్యధిక నేత్రదాన స్వీకరణలో ముందు ఉండడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. విద్యా దానం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్య, క్రీడా సామాగ్రి తో పాటు యూనిఫారం కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెడికల్ క్యాంపుల్లో భాగంగా క్యాన్సర్ ఉచిత క్యాంపులు, కంటి ఆపరేషన్ల క్యాంపులు నిర్వహించి, వేలాది మందికి కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది అన్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలలో పాఠశాలలకు, దేవాలయాలకు ఉచితంగా తాగు నీటి ట్యాంకులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. మానవుని మేధాశక్తిని పెంపొందించుటకు రాష్ట్రీయ, జాతీయ స్థాయిలలో చదరంగ పోటీలు కూడా నిర్వహించామన్నారు. మున్ముందు కూడా ప్రజల సలహాలు, విద్యావేత్తల సూచనలు, దాతల సహాయ సహకారాలతో పట్టణ గ్రామీణ ప్రాంతాలలో మరిన్ని సేవలను కొనసాగిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు యొక్క మన్ననలు పొందుతూ అగ్రగామిగా యువర్ ఫౌండేషన్ సంస్థ ముందుకు వెళ్లడం మాకెంతో గర్వంగా ఉందని తెలిపారు. అన్నివేళలా అందరికీ అందుబాటులో ఉంటూ, పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం రోగులకు సహాయకులకు దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతోద శీన్నారు. ఈ కార్యక్రమంలో పోలా ప్రభాకర్,డాక్టర్ సుబ్బారావు, బండ్లపల్లి రంగనాథ్, కుమారస్వామి, జయంతి వినోద్, ఓవి ప్రసాదులు పాల్గొన్నారు
నూతన కార్యవర్గశీ…. అనంతరం నూతన కమిటీగా అధ్యక్షులు వై కే శ్రీనివాసులు, కార్యదర్శిగా సుంకు సుకుమార్, ఉపాధ్యక్షులుగా షీలా నాగేంద్ర, పిఆర్వోగా జయరాం, సహయ కార్య దర్శిగా బండి నాగేంద్ర, సభ్యులుగా నామాల శ్రీనివాసులు, పవన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img