Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదల ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరు చేయాలి

సిపిఐ తాలూకా కార్యదర్శి మల్లికార్జున
విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇల్లు నిర్మాణానికి రూ.1.80 లక్షల రూపాయల మాత్రమే ఇస్తుందని ప్రస్తుతం పెరిగిన ధరలు వల్ల పేద ప్రజల ఇల్లు నిర్మాణం భారంగా మారిందని ప్రభుత్వం వెంటనే ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయాలని సిపిఐ పార్టీ ఉరవకొండ తాలూకా కార్యదర్శి మల్లికార్జున అన్నారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పట్టణ పరిధిలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చెప్పనా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ప్రస్తుతం ఇల్లు నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని జగనన్న కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని తదితర అనేక డిమాండ్లతో ఈనెల ఐదవ తేదీన మండల రెవెన్యూ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు నిర్మించుకుంటున్నా లబ్ధిదారులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తాలూకా సహాయ కార్యదర్శి వన్నూరు సాహెబ్‌, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్‌, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, పార్టీ నాయకులు రజాక్‌ షేక్‌, మహిళా సంఘం నాయకురాలు వరలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img