Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేద ప్రజలకు సేవ చేయుటలో సంతృప్తి కలదు.. వైద్యులు రాఘవేంద్ర,నాగార్జున

విశాలాంధ్ర`ధర్మవరం : పేద ప్రజలకు వైద్య సేవ చేయుటలో ఎంతో సంతృప్తి ఉందని వైద్యులు రాఘవేంద్ర,నాగార్జునలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎర్రగుంట-కేతిరెడ్డి కాలనీలో గల కాకతీయ ఉన్నత పాఠశాలలో శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ దంత అండ్‌ స్కిన్‌ కేర్‌ క్లినిక్‌.. మంజు లాడ్జ్‌ దగ్గర.. ధర్మవరం, శివానగర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్లినిక్‌ అండ్‌ మెడికల్స్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా కాకతీయ స్కూల్‌ వ్యవస్థాపకులు రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరము కాస్మోటిక్‌ దంత వైద్య నిపుణులు రాఘవేంద్ర, జనరల్‌ డాక్టర్‌ నాగార్జున, చర్మవ్యాధులు, సుఖ వ్యాధులు, కుష్టి వ్యాధుల నిపుణు రాలు డాక్టర్‌ వల్లభ రెడ్డి ఉమాదేవిలు అక్కడి ప్రజలకు వైద్య చికిత్సలను అందించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను తెలియజేశారు. ముఖ్య అతిధి రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా సేవ చేస్తున్న ఈ క్లినిక్‌ వైద్యులు, ప్రజల్లో మంచి గుర్తింపు పొందడం సంతోషదాయకమన్నారు. మరిన్ని ఉచిత సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగించాలని వారు కోరారు. ఈ శిబిరమునకు 300 మంది రోగులు వైద్య చికిత్సలు అందుకొని, ఉచితంగా మందులను కూడా శిబిరా నిర్వాహకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌడయ్య ,రాము, గట్టు వెంకటేష్‌, శివారెడ్డి, మస్తాన్‌ రెడ్డి, మల్లికార్జున, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img