Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేద ప్రజల సమస్యలకై పోరాడేదే విశాలాంధ్ర దినపత్రిక.. ఆర్డీవో తిప్పే నాయక్

విశాలాంధ్ర -ధర్మవరం : పేద ప్రజల సమస్యలకై పోరాడేదే విశాలాంధ్ర దినపత్రిక అని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ తిప్పే నాయక్ తో పాటు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జింకా చలపతి, సిపిఐ నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు, పట్టణ కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి ఎర్రం శెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సకల రాజా, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య, శివ తో పాటు శ్రీధర్, శంకర్, ఆది, చౌడప్ప లు2023 సంవత్సరపు క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆర్డీవో తిప్పే నాయక్ మాట్లాడుతూ విశాలాంధ్ర జాతీయ దినపత్రిక అతి పురాతన పత్రిక అని, 71 సంవత్సరాల తరబడి పాఠకులకు, ప్రజలకు వివిధ రకాల సమాచారాన్ని అందించడం జరుగుతో శీదన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వ దృష్టికి పరిష్కరించే దిశగా పోరాటాలు సల్పడములో కీలకపాత్ర వహించడం జరిగిందన్నారు. 71 సంవత్సరాలుగా పత్రిక మనుగడ సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదని, ఎంతోమంది సిపిఐ నాయకుల, ప్రజల సహాయ సహకారాలు ఉండడమే ఇందుకు నిదర్శనం అన్నారు. మున్ముందు కూడా ప్రజల తరఫున విశాలాంధ్ర పత్రిక పోరాడుతూ ప్రజల మన్నలను తప్పక పొందగలుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img