Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పేద విద్యార్ధులకు విదేశీ విద్యను దూరం చేసిన వైసీపీ ప్రభుత్వం

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం పేద విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేయడానికి నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిరసన తెలిపారు. అనంతరం మండల తహసీల్దార్ సువర్ణ కి వినతిపత్రాన్ని అందజేశారు. సంపన్న వర్గాలతో సమానంగా బడుగుబలహీన వర్గాల వారందరికీ కూడా విదేశాల్లో చదువుకునే హక్కు కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం విదేశీ విద్యను అమలు చేసింది..
ఐదేళ్లలో బీసీ,ఎస్సి,ఎస్టీ వర్గాల వారికి 4923 మందికి విదేశాల్లో చదువుకునేందుకు రూ 10 లక్షల చొప్పున రూ 364 కోట్లు ఆర్థిక సహాయం అందించాం..
అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా రూ 20 లక్షలతో విదేశీ విద్యా అందిస్తామని హామీ ఇచ్చి, మెనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. గత ప్రభుత్వం వేల మందికి విద్యార్థులకు పథకం అమలు చేసి వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎలాంటి ప్రచారం చేసుకోలేదు కానీ నేడు 213 మందికి రూ 19 కోట్లు ఖర్చు చేస్తే దానికి 20 కోట్లతో ప్రకటనలిచ్చారు. జగన్ రెడ్డి అంబేద్కర్ పేరును కూడా తీసివేసి నిస్సిగ్గుగా తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు
ఈ కార్యక్రమంలో అశ్వర్థప్ప, హుజూర్, సాయి ప్రసాద్, జావిద్, బోయ గాయత్రి, అండ్రూస్, పెద్దన్న, నరసింహులు, సయ్యద్, వెంకటేష్, బోయ అనిల్ కుమార్, దోని లక్ష్మీనారాయణ, హర్షద్ అలీ, శంకర్, ఉపాధ్యక్షులు శ్రీహరి, వి. శ్రీనివాసులు, కె.ప్రభాకర్, , గొల్ల నాగరాజు, శరత్ కుమార్, గోపి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img