Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పోరాటంతో విద్యార్థుల విజయం

విశాలాంధ్ర`ఉరవకొండ : ఎస్కే యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగంలో ప్రవేశాలను రద్దు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం పట్ల ఉరవకొండ ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విద్యార్థి సంఘ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ వైస్‌ ఛాన్సలర్‌ విద్యార్థి వ్యతిరేక విధానాల తీసుకోవడం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ఎస్కేయూలో 2022 – 23 నుండి న్యాయ శాస్త్ర విభాగంలో ప్రవేశాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలికి యూనివర్సిటీ అధికారులు లేఖ రాయడం జరిగిందని తెలిపారు. విద్యార్థి సంఘాలు ఉద్యమించడంతో అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రమోద్‌,నిధి, సుమంత్‌, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img