Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలీస్‌ వ్యవస్థను కించపరచడం ఎమ్మెల్యే కేశవకు తగదు

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ :
రాష్ట్రంలో పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ అనే అర్థం మార్చేశారని, ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పినట్లు పోలీస్‌ వ్యవస్థ నడుస్తోందని, తాము అధికారంలోకి వచ్చాక పోలిస్‌ వ్యవస్థపై కమీషన్‌ వేస్తామని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ బెదిరింపు దోరణిలో మాట్లాడటం బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు నిదర్శనమని ఎమ్మెల్సీ వై.శివరామి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారములో ఉన్నప్పుడు పోలిసులను బెదిరిస్తూ గ్రామల్లో అమాయకులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేదించిన విషయాన్ని కేశవ్‌ మరిచిపోయారా అన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేసింది, చేస్తున్నది తెలుగుదేశం పార్టీ వారు కాదా అన్నారు. గతంలో పోలీసులను బెదిరించి ఎన్నో అకృత్యాలకు పాల్పడి సంఘటనలను ప్రజలు ఎవరు కూడా మరిచిపోలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే పోలీసు వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తూ అధికారం చేపట్టిన మొదటి రోజే చట్టం దృష్టిలో అందరూ సమానమని తప్పు చేసిన వారు ఎవరినైనా ఉపేక్షించవద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నారు తెలుగుదేశం పార్టీ వారు పదేపదే పోలీస్‌ వ్యవస్థపై బురద వెదజల్లుతూ వారిని బెదిరిస్తూ బ్లాక్మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు పదే పదే పోలీసులపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని కుల, మత, వర్గాల పేరుతో ప్రజల్ని విభజించిన ఆయన ఇప్పుడు అధికారుల్ని, పోలీసు సిబ్బందిని కూడా ఇలా వర్గాల పేరుతో విడిదియడానికి కుట్రలు చేస్తున్నారన్నారు పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవాలను గుర్తించి పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడడం తగదన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img