Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజలకు, ప్రభుత్వానికి వారథులు గ్రామ వాలంటీర్లు : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : ప్రభుత్వానికి, ప్రజలకు గ్రామ వాలంటీర్లు వారథులని, వారి ద్వారానే అన్ని రకాల సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందుతున్నాయని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జెడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా సీఎం జగన్ పథకాలు ప్రవేశపెడుతున్నారని, ఇందులో భాగంగా సచివాలయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వాలంటీర్లు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో సిఫార్సులుంటేనే పథకాలు అందేవని, ప్రస్తుతం అర్హతలు ఉంటే చాలు…వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వివరాలు సేకరించి పథకాలు మంజూరు చేయిస్తున్నారని అన్నారు. మరోసారి జగనన్నను సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో భాగంగా సేవావజ్ర, సేవారత్న సేవామిత్ర అవార్డులు పొందిన వాలంటీర్లకు శాలువాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, ఈఓఆర్డీ ఎస్.మాధవి, ఏఓ రత్నాబాయి,  జెడ్పీటీసీ పసుపుల హేమావతి, ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, వైస్ ఎంపీపీలు, కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img