Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజల ఆర్యోగం కోసం ఉచిత వైద్య శిబిరం

విశాలాంధ్ర-రాప్తాడు ..గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జెడ్పీటీసీ పసుపుల హేమావతి, సర్పంచ్ ప్రభావతి కొనియాడారు. హంపాపురం సమీపంలో ఉన్న ఎస్వీఐటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా మరూరు గ్రామంలో మంగళవారం డాక్టర్ పి.శ్రీనివాసులుతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఆరునెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని, వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ వీబీఆర్ శర్మ, ఛైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్రరెడ్డి,కళాశాల సీఈఓ ఆనందకుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సూర్యశేఖరరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం. శ్రీనివాసులు నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img