Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజారోగ్యం కోసమే గ్రామస్థాయిలో ఆసుపత్రులు :ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

విశాలాంధ్ర-రాప్తాడు : సంపూర్ణ ప్రజారోగ్యం కోసం గ్రామస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను సీఎం జగన్ మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం సంతోషించాల్సిన విషయమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ పథకంలో భాగంగా గురువారం రాప్తాడు మండలం చిన్మయ నగర్‌లో విలేజ్‌ క్లినిక్‌ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ… ఫ్యామిలీ డాక్టర్‌ అనే కొత్త కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉన్న ఊరిలోనే ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు. మహానేత వైయస్ఆర్ తర్వాత పూర్తిస్థాయిలో వైద్యంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇదేనన్నారు. 99 శాతం వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చారని.. ప్రజలను కాపాడుకునేందుకు సీఎం నిరంతరం కష్టపడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో పరిటాల సునీత మంత్రిగా ఉండగా నియోజకవర్గ వ్యాప్తంగా 1200 ఇళ్లు మాత్రమే ఇచ్చారని…ఇక తాగు, సాగునీరు గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా 26 వేల ఇళ్లను తీసుకొచ్చి అర్హులైన ప్రతి పేదకు మంజూరు చేశామన్నారు. నేటి నుండి నుంచి 20వ తేదీ వరకు చేపట్టనున్న జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమానికి సంబంధించిన కిట్లను స్థానిక సచివాలయ కన్వీనర్లు, గృహసారథులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, జెడ్పీటీసీ పసుపుల హేమావతి,
కన్వీనర్, యూత్ కన్వీనర్లు జూటూరు శేఖర్, చిట్రెడ్డి సత్తిరెడ్డి, వైస్ ఎంపీపీలు, డాక్టర్ శ్రావణి, సర్పంచ్ శశికళ, నాయకులు లోకేశ్వర్ రెడ్డి, విజయ్, నాయకులు, కార్యకర్తలు, ఆశా కార్యకర్తలుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img