Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలి

అఖిలపక్ష పార్టీల నేతలు

విశాలాంధ్ర-కదిరి: కదిరి పట్టణంలో స్థానిక వేమారెడ్డి సర్కిల్ నందు జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని జీవో పథ్లలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి యం. వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఇటీవల మాచర్ల, గుంటూరు సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష , వామపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాలు కాని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరిని రోడ్డు మీదకు రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ ఒకటిని తీసుకువచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నాడని ముఖ్యమంత్రి పై మండి పడ్డారు. అదేవిధంగా పాలిమర్ సంఘటనలో పదుల సంఖ్యలో విశాఖ ప్రజలు చనిపోయారని, అన్నమయ్య ప్రాజెక్టు పనులు సరిగ్గా చేయక పోవడంతో దాదాపు52 మంది చనిపోయారని, కరోన సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తిరుపతి రుయా హాస్పిటల్ లో 32 మంది చనిపోయారని,కరోనతో కదిరి ప్రభుత్వ హాస్పిటల్ లో8 మంది చనిపోయారని, కదిరి పట్టణంలో మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బిల్డింగు కూలి 7 మంది చనిపోయారని ఇలా ఈ మూడున్నర ఏళ్ల లో వందల మంది చనిపోయారని దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. టిడిపి అధికార ప్రతినిధి మనోహర్ నాయుడు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు బాబ్జాన్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గారికి వస్తున్న ప్రజాధరణ ఓర్చుకోలేక అర్ధరాత్రి వెడల్ చేసిన జీవో నెంబర్ ఒకటి తో ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్నారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం పోలీసు భద్రతా వలయాల మధ్య కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేని ముఖ్యమంత్రి ప్రతిపక్ష వామపక్ష పార్టీల కార్యకలాపాలను బలవంతంగా నియంత్రించడానికి రోడ్షోలు బహిరంగ సభలపై నిషేధాన్ని విధిస్తున్నారని యదాపా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇలాంటి చీకటి జీవోలతో కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని దీనికి భయపడి సభలో సమావేశాలు పాదయాత్రలు ఆపమని కచ్చితంగా పాదయాత్ర చేసి ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు పోరాటాన్ని సాగిస్తామని హెచ్చరించారు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి నాకు ఎంపీ సీట్లు అధికంగా వస్తే కేంద్ర ప్రభుత్వంతో మెడలో వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీలను తీసుకొస్తానని ప్రగల్బాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు 22 ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించి అధికారంలోకి తీసుకు వస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయకుండా కేసులకు భయపడి ప్రత్యేక హోదా ఊసే ఎత్తకుండా కేంద్రంతో భోజనాలు చేసి రాష్ట్రానికి వస్తున్నారని రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడగకూడదని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని హక్కులను కాలరాస్తూ జీవో నెంబర్ ఒకటిని తీసుక వచ్చిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం బస్సు యాత్రను చేపడతామని ఇలాంటి ఎన్ని జీవోలు తెచ్చిన రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను కచ్చితంగా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇసాక్, కదిరప్ప,పట్టణ కార్యదర్శి లియాకత్, సహాయ కార్యదర్శిలు మనోహర్, ఆదెప్ప, ఇమ్రాన్, ఏఐకేఎస్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మధు నాయక్ ,ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేషం మహేంద్ర, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు అబ్దుల్లా, సిపిఎం నాయకులు జగన్మోహన్ ,రామ్మోహన్, నారాయణ,టిడిపి నాయకులు చంద్రశేఖర్, తేపల్లె మనోహర్, రాజేంద్ర నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడాలగుంది రమణ, అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img