Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతిపక్షాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం…

గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి…

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్ ప్రజల సక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్నామని ప్రతిపక్షాలకు గునపాఠం చెప్పెందుకే జగనన్నే మా భవిష్యత్తు.. తద్వారా మా నమ్మకం నువ్వే జగన్‌్ణ కార్యక్రమం ద్వారా నిరూపించాలని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాల ప్రజలు పూర్తి విశ్వసనీయత కనబరిచి ాజగనన్నే మా భవిష్యత్తు్ణ అంటూ నినదించిందని అన్నారు. ప్రతిపక్షాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని మేం బలంగా నమ్ముతున్నామని తెలిపారు.ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకొని పని చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ ఉన్నారని తెలిపారు. ామా పార్టీ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తోందని అన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేయడం కోసం అనుక్షణం తపిస్తోందని,చంధ్రబాబు నాయుడు,నారాలోకేష్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ అసత్యాల స్థానంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. సీఎం జగన్‌ సంక్షేమ రథానికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుతగులుతున్న వైనాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. పీపుల్స్‌ సర్వేలో భాగంగా ప్రతి ఇంట్లోనూ సభ్యులను 5 ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను ాప్రజా మద్దతు పుస్తకం్ణలో నమోదు చేస్తాం అని రశీదు కూడా ఇస్తాం్ణ అని తెలిపారు.జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను కోరుతామని, ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడి ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగప్ప ,ఎంపీపీ బివి మాధవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మోహన్ ,మాజీ పట్టణ అధ్యక్షులు ఎద్దుల శంకర్,సింగల్ విండో ప్రెసిడెంట్ సుంకిరెడ్డి,యుగేంధర్ ,లింగన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img