Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో నెంబర్ 1…

రాష్ట్ర ప్రభుత్వం జీవో ఒకటిని తక్షణం రద్దు చేయాలి…

సీపీఐ నియోజికవర్గం కార్యదర్శి వీరభధ్రస్వామి

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు ,ప్రజా సంఘాలు చర్చిస్తే గొంతు నొక్కెందుకే జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 ని తీసుకొచ్చాడని సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని స్వతంత్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు కూడలి వద్ద సిపిఐ, సిపిఎం,బిఎస్పి,టిడిపి, జనసేన నాయకులు జీవో ఒకటిని రద్దు చేయాలని నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులు సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి,సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, బీఎస్పీ పార్టీ నాయకులు శ్రీనివాసరాజు,టిడిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ కాలం నాటి ఆంక్షలు విధించేందుకు జీవో ఒకటిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. రోడ్లపై సభలు,ర్యాలీలు ,రోడ్ షోలు నిర్వహించడాన్ని నిషేధించడమే ఈ జీవో 1 అని తెలిపారు. ఇదొక నల్ల చట్టం తీసుకొచ్చిందని మండిపడ్డారు. సైకో సీఎం పాలన జరుగుతుందని తెలిపారు. జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయానికి రాబోయే ఎన్నికలలో అధికార పార్టీ దిగిపోవడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సాంకేతికని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఐ నాయకులు మల్లయ్య,గురుస్వామి,బాస్కర్ ,సూరి,ఏఐఎస్ఎఫ్ నాయకులు వేణు,వినోద్ ,చంద్ర ,ఏఐవైఎఫ్ నాయకులు వంశీ,నందు,సిపిఎం నాయకులు సాకే నాగరాజు,టిడీపి కౌన్సిలర్ షరీఫ్ ,ఎంఆర్ పిఎస్ నాయకులు ఆనంద్ .నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img