Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతి ఇంటికీ ఉచిత తాగునీటి కుళాయి ద్వారా శుద్ధ జలం : సర్పంచ్ ఎం.లక్ష్మీకళ

విశాలాంధ్ర- రాప్తాడు : గ్రామంలో ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీటి కుళాయి ఏర్పాటు చేసి శుద్ధజలం సరఫరా చేయడమే లక్ష్యమని సర్పంచ్ ఎం.లక్ష్మికళ అన్నారు. జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్, రైజెస్ ఎన్జీఓ సంయుక్తంగా అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి గ్రామంలోని కుటుంబాలకు నూరుశాతం ఇళ్లకు కుళాయిలు ఇచ్చారు. ఈ సందర్భంగా శనివారం గ్రామ ప్రజలతో గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, జేజేఎం ఐఎస్ఏ జిల్లా ఆర్డినేటర్ నరేష్, ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ జల్ జీవన్‌ మిషన్‌లో భాగమైన పథకాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ప్రోత్సహించడానికి ఇంటింటికీ తాగునీరు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయన్నారు. . గ్రామీణ ప్రాంతాల్లోని ఆవాసాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమశాలలతోపాటు ప్రభుత్వ సంస్థలకు నీటి కనెక్షన్లు అందించడానికి రాష్ట్రీయ జల్‌ జీవన్ కోష్ నిధిని ప్రారంభించాయన్నారు. ఈ నిధికి వ్యక్తులు, సంస్థలు, విదేశాల్లో ఉంటున్న వారు ఎవరైనా చందాలు ఇవ్వవచ్చని దీనిద్వారా తాగునీటి సమస్య తలెత్తినప్పుడు ఈ నిధిని వినియోగించుకోవచ్చన్నారు. ఈసందర్భంగా కామారుపల్లి గ్రామంలో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందించినట్లుగా రైజెస్ స్వచ్ఛంద సంస్థ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరెడ్డికి హర్ ఘర్ జల్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రైజెస్ ఎన్జీఓ ఐఈసీ ఎక్సపర్ట్ కమ్మూరు శీనా, సోషల్ డెవలప్మెంట్ ఎక్సపర్ట్ ఓబులపతి, ఇంజినీరింగ్ అసిస్టెంట్ మహబూబ్ బాషా, సచివాలయ సిబ్బంది శ్రీపతి, అనిల్, గాయత్రి, వినోద్, వినీత, అంగన్వాడీ కార్యకర్త మునీశ్వరి, ఆశా కార్యకర్త పుష్పావతి, వీడబ్ల్యూఎస్సీ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img