Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి.. పోరాల్ల పుల్లయ్య.

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకుంటే జీవితములో మనశ్శాంతి లభిస్తుందని శ్రీ అన్నమయ్య సేవా మండలి పోరాళ్ళ పుల్లయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణంలో వెలసిన శ్రీ అన్నమయ్య యొక్క 615 వ జయంతి వేడుకలను శనివారం ఉదయం ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత అర్చకులు కోనేరా చార్యులు అన్నమయ్యకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అన్నమాచార్య సంకీర్తనలను పంచమ సింగారి మేళముల నడుమ ఆలపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పోరాల్ల పుల్లయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు దైవభక్తిని కూడా అలవాటు చేయాలని, తద్వారా క్రమశిక్షణతో కూడిన విద్య లభిస్తుందని, మంచి ఆలోచనకు చక్కటి అవకాశం లభిస్తుందని తెలిపారు. అచ్చ తెనుగు పద సంపద అన్నమయ్య మన సంపద అని తెలిపారు. అన్నమయ్య పదమే భక్తి పథం మని, పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన తాళ్లపాక అన్నమాచార్యుడు తొలి తెలుగు వాగ్గేయకారుడని తెలిపారు. ఆయన తన జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి కంకరయానికి అంకితం చేసిన ధన్యజీవి అని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలు ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదని, అన్నమయ్య పదాలు అనంత భక్తి బావ పరిమళాలని తెలిపారు. అన్నమయ్య తన పద కవితా రచనలో సృసిన్చని అంశం అంటూ ఏదీ లేదు అని తెలిపారు. అన్నమయ్య అనేక సంప్రదాయాలలో రచనలు చేసి తర్వాతి పధకర్తలకు మార్గదర్శకుడు అయ్యారని తెలిపారు. అన్నమయ్య చిన్నతనము నుంచే దైవభక్తిని తో ఉంటూ, అజ్ఞానపు చీకటిలో అలమటిస్తున్న జనులను తరింపజేయుటకు సంకీర్తన రచన ఒకటే శరణ్యమని భావించి, 32వేల సంకీర్తనలు రచించి, తరతరాల వారికి తరగని పద సంపదని అందించిన గొప్ప వాగ్గేయకారుడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అన్నమయ్య సేవా మండలి కార్యదర్శి గోవిందరాజులు, కోశాధికారి నాగార్జున, ఉపాధ్యక్షులు మల్లికార్జున, పద్మావతి, పుండరీక, పోతిరెడ్డి, నరసింహారెడ్డి, జక్కా బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img