Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతి గర్భిణికి నాలుగుసార్లు తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్‌
విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యుగంధర్‌ అధ్యక్షతన, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా.గంగాధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురంలోని 10 పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు 74 సచివాలయాల సిబ్బందికి రిప్రడక్టివ్‌ చైల్డ్‌ హెల్త్‌ ( ఆర్‌ సి హెచ్‌ ) గురించి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేసి సిబ్బందికి ఆర్‌సిహెచ్‌ ఆన్లైన్‌ లో అప్లోడ్‌ విధానం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు ఆన్లైన్‌ లో అప్లోడ్‌ చేసే విధానం లో 100 శాతాన్ని చేరుకోవాలని, వ్యాధినిరోధక టీకాల లో కూడా నూరు శాతం ఆన్లైన్‌ అప్లోడ్‌ చేయాలని తెలియజేశారు. ప్రతి గర్భవతి కి నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేసి సంభందిత పోర్టల్‌ లో పొందు పరచాలని అన్నారు. గర్భవతులలో రక్త హీనత గురించి ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఏదేని టెక్నికల్‌ ఇబ్బందులు వస్తే వెంటనే తమను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ హెల్త్‌ వైద్యాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img