Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రతి మహిళా.. కుటుంబం నుంచే లింగ వివక్షతను రూపుమాపాలి : డీఎల్డీఓ ఓబులమ్మ

విశాలాంధ్ర-రాప్తాడు : సమాజంలో లింగ వివక్షను రూపుమాపేందుకు ప్రతి మహిళా.. కుటుంబం నుంచే చైతన్యం తీసుకురావాలని డివిజనల్‌ లెవెల్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌(డీఎల్డీఓ) ఓబులమ్మ సూచించారు. లింగాధారిత వివక్షపై జాతీయస్థాయి మాసోత్సవాల్లో భాగంగా శనివారం రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీలోని చిన్మయ నగర్‌ లో స్వయం సహాయక సంఘ మహిళల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి లింగ వివక్షత పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎల్డీఓ ఓబులమ్మ మాట్లాడుతూ ఇంట్లో ఆడమగ అనే తేడా లేకుండా అబ్బాయితో సమానంగా అమ్మాయిలను పెంచి ఉన్నత విద్య చదివించాలని, వారి స్వశక్తితో ఎదిగేలా ప్రతి మహిళ, ప్రతి కుటుంబం కృషి చేయాలన్నారు. సమాజంలో జరిగే బాలికలపై జరిగే అత్యాచారాలను, బాల్యవివాహాలను, కుటుంబ హింసను అరికట్టడానికి ప్రతి సంఘంలోని మహిళ కృషి చేయాలని తెలియాలన్నారు. ఎంపీడీఓ చిట్రెడ్డి జయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు కూడా ఆస్తి హక్కు కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రతి మహిళ చదువుకొని మహిళలపై జరిగే ఆకృత్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్‌, ఈఓఆర్డీ మాధవి, ఏపీఎం శివకుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ శశికళ, సీసీ శ్రీరాములు, విఓఏలు, గ్రామ సంఘాల, స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img