Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించాలి…

శ్రీ సత్య సాయి జిల్లా సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌ ఆనంద భాస్కర్‌ రెడ్డి
విశాలాంధ్ర`ధర్మవరం :
ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించాలని జిల్లా సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌ ఆనంద భాస్కర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్సు సంబరాల్లో ముఖ్య అతిథిగా ఆనంద భాస్కర్‌ రెడ్డి తో పాటు జెవివి గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ బషీర్‌, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆదిశేషు, చెకుముకి జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి లు పాల్గొన్నారు. తదుపరి ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ 130 కోట్ల దేశ జనాభాలో ఎంతోమంది శాస్త్రవేత్తలు తయారు కావలసి ఉన్న సివి రామన్‌ తర్వాత ఒక్కరికి కూడా సైన్స్‌ రంగంలో నోబుల్‌ బహుమతి రాకపోవడం బాధాకరమన్నారు. మూడ నమ్మకాల వైపు సమాజాన్ని తీసుకుపోవాలనుకునే శక్తుల విషయంలో సైన్స్‌ ప్రచార సంస్థలు మరింత అప్రబంధంగా ఉంటూ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనదేశంలో సైన్స్‌ పరిశోధనలకు కేటాయించే అరాకొర నిధుల కారణంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతోందని తెలిపారు. దారిద్రము, నిరుద్యోగము, నిరక్షరాస్యత, అనారోగ్యం, కరువు కాటకాలు పోయి దేశ ప్రజల్లో గుణాత్మక మార్పు రావాలంటే, ఒక్క సైన్స్‌ అభివృద్ధితోనే సాధ్యమవుతుందని తెలిపారు. పట్టణములోని ప్రైవేట్‌ పాఠశాలల నుంచి బాయ్స్‌ టౌన్‌ స్కూల్‌, జీవన్‌ జ్యోతి, కాకతీయ విద్యార్థులు వరుసగా ప్రధమ,ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలువగా ప్రభుత్వ పాఠశాలలో బిఎస్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్‌ స్కూల్‌, గణేష్‌ మున్సిపల్‌ హై స్కూల్‌ విద్యార్థులు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు నరేంద్రబాబు, లోకేష్‌, సురేష్‌, ఉపాధ్యాయులు శేఖర్‌, జిలాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img