Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం..

విశాలాంధ్ర- జె ఎన్‌ టి యు ఏ : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని జవహర్లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్‌ పేర్కొన్నారు. గురువారం ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలును పురస్కరించుకొని ఉపకులపతి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఎన్‌ సి సి, మెకానికల్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఈసీ ఈ , సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల గౌరవ వందనాన్ని ఉపకులపతి, రిజిస్ట్రార్‌ ఆచార్య సి. శశిధర్‌, ప్రిన్సిపల్‌ ఆచార్య పి. సుజాత స్వీకరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ..సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ అందించాలని పేర్కొన్నారు. వందే భారత్‌ రైలు, గ్రీన్‌ ఎనర్జీ , సాంకేతిక ప్రగతి, యూపీఐ, ఉత్పాదక శక్తిలో దేశాభివృద్ధిలో భారత్‌ అగ్రగణంగా నిలుస్తూ ఉందన్నారు. యువత పరిశోదాత్మక విజ్ఞానంతో సమాజ నిర్మాణానికి పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. ఏడదిగా విశ్వవిద్యాలయంలో గత ఏడాది చేసిన అభివృద్ధి అంశాలపై తెలిపారు. నైపుణ్య ప్రమాణాలు, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా విద్యార్థులను ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులను సన్నద్ధత చేస్తున్నామన్నారు. త్వరలో నూతన పరిపాలన భవనం ప్రారంభిస్తామని అన్నారు. నూతన విద్యా విధానం పాలసీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. అనంతరం వివిధ బహుళ జాతి కంపెనీలలో ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టర్‌ విజయ్‌ కుమార్‌, డైరెక్టర్స్‌ దేవన్న, ఈశ్వర్‌ రెడ్డి, సుమలత, ఓటిపిఆర్‌ఐ కళాశాల డైరెక్టర్‌ బి. దుర్గాప్రసాద్‌, కె. బి చంద్రశేఖర్‌, చంద్రమోహన్‌ రెడ్డి, నారాయణరెడ్డి, పి ఆర్‌ ఓ రామశేఖర్‌ రెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img