Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి

విశాలాంధ్ర-అనంతపురం వైద్యం : ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భముగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వీరబ్బాయి ఆధ్వర్యంలో సోమవారం సమావేశ భవనంలో నోటి శుభ్రత, దంత ధావన చేయవలసిన విధానం,నోటి క్యాన్సర్ నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి డాఁ. నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ ఆరోగ్యం కోసం శీతల పానీయాల వినియోగం తగ్గించాలని, ఆహారం తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవాలన్నారు. తీపి పదార్థాలను తక్కవగా తీసుకోవాలని, పొగాకు వాడకం,మత్తు పదార్థాల సేవనం మానుకోవాలన్నారు. అదే విధంగా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని క్రమం తప్పకుండా దంత వైద్యుణ్ణి సంప్రదించాలన్నారు. ఆంక్రమిత వ్యాధి గ్రస్తులు అనగా రక్త పోటు, మధుమేహం, క్యాన్సర్ ,థైరాయిడ్ వంటి వ్యాధి ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రులు, పాఠశాల లో ఉపాధ్యాయులు పిల్లలకు దంత శుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ముందు జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ ఈ నోటి శుభ్రత పై అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతులవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా .ఁయుగంధర్, ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ ఆఫీసర్ డాఁ.సుజాత,ఏ .ఒ ప్రభాకర్ మోసెస్, ఆంజనేయులు, ప్రేమ్, శ్రీరాములు, మౌనిక, శశికళ , నరేష్ డెమో భారతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, వేణు, కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img