Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రభుత్వాల విధానాలతో సంక్షోభంలో వ్యవసాయం

జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్‌ కుమార్‌
విశాలాంధ్ర`ఉరవకొండ :
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విధానాల వల్ల వ్యవసాయం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతం కుమార్‌ అన్నారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆదేశాలు మేరకు శుక్రవారం ఉరవకొండ మండలంలో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రైతుల పడుతున్న బాధలను కష్టాలను తెలుసుకోవడానికి తమ పార్ట సభ్యులతో కలిసి ఉరవకొండ మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు రైతులకు రావలసిన పంట నష్టపరిహారం పంటల భీమా, రైతు భరోసా పథకాలు చాలామంది రైతులకి అందాల్సి ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు రైతులకు సబ్సిడీతో అందించే విత్తనాలు,,పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు ఏమి కూడా రైతులకు అందడం లేదన్నారు. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని వైసిపి నాయకులు చెప్తున్నప్పటికీ రైతులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు పండిరచిన పంటలుకు గిట్టుబాటు ధర కల్పించాలని పంటలు యొక్క రుణాలను మాఫీ చేయాలని, పెద్ద ఎత్తున సబ్సిడీ పథకాలు అందించాలని, 6%శీ% సంవత్సరాలు వయసు దాటిన రైతులకు పింఛన్‌ సౌకర్యం కల్పించాలని రైతులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని వారు పేర్కొన్నారు. రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడకూడదని. హక్కులను పోరాడి సాధించుకుందామని పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ రైతు దినోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చంద్రశేఖర్‌, దేవేంద్ర రమేష్‌, తిలక్‌, మునికుమార్‌ భోగేష్‌ కుమార్‌, రూపేష్‌ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img