Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఐ డివిజన్‌ కార్యదర్శి శ్రీరాములు నేతృత్వంలో సిపిఐ నాయకులు మరియు ఏఐటీయూసీ నాయకులు తో కలిసి డాక్టర్లతో చర్చించి మరియు ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక చిన్న గాయాలైన వెంటనే అనంతపురం గానీ హిందూపురం గాని ఉన్నారని గర్భవతులు ప్రసవ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదని త్రాగునీటి వసతులు లేవని పెనుకొండ చుట్టుపక్క ప్రాంతాలలో ప్రమాదాలు జరిగితే ట్రామా కేర్‌ యూనిట్ను వెంటనే ప్రారంభించాలని నిరసన తెలియజేశారు సత్యసాయి జిల్లా ఏర్పడిన సంవత్సరం అవుతున్న రెండవ జిల్లా కేంద్రంగా ఉన్న పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రులపై వైసిపి ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని పాలకులు వెంటనే వీటిపై శ్రద్ధ చూపాలని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ప్రభుత్వాసుపత్రిల మీద నమ్మకం కలిగేలా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని డాక్టర్ల నియామక ప్రక్రియ చేపట్టాలని సిబ్బంది నియామకం చేపట్టి మెరుగైన వైద్యం అందించాలని వారు కోరారు డాక్టర్‌ శివ కుమారస్వామి కలగజేసుకుని మీ సమస్యలను వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలపడంతో నిరసనను విరమింప చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వెంకటేషులు మండల కన్వీనర్‌ నరసింహ జాఫర్‌ మల్లికార్జున వెంకట్రాముడు ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణ ఆటో కార్మిక యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img