Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు మా పోరాటాలు ఆగవు..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయుడు
విశాలాంధ్ర -ధర్మవరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంతవరకు తాము పోరాటాలను ఇకముందు తీవ్రంగా కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయుడు, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మార్వో కార్యాలయ ఆవరణ ముందు ఒక్కరోజు రిలే నిరాహార దీక్షను ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ దీక్ష ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగింది. అనంతరం రఘురాం నాయుడు, భాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతినెలా ఒకటవ తేదీనే జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. ప్రభుత్వ యొక్క పథకాలను సక్రమంగా ప్రజలకు అందించే వారే ప్రభుత్వ ఉద్యోగులని, మరి నెల అంతా విధులు కొనసాగించి, జీతాలు రాకపోవడం కు కారణం ఏమిటనీ ?వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేటికి నాలుగు సంవత్సరాలు గడిచిన, ఆ హామీని నెరవేర్చకపోవడం ఏమిటని వారు మండిపడ్డారు. బకాయి పడ్డ టి ఏ.. అలవెన్స్లు నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాల పట్లనే తాము ఈ దీక్షలు కొనసాగించడం జరిగిందని తెలిపారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు 9 నెలల అరియర్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సి పి ఎస్ ను రద్దుపరిచి, ఓపిఎస్లు పునరుద్దించాలని తెలిపారు. ప్రతినెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేలా చట్టం కావాలన్నారు. ఎన్.ఎం.ఆర్, డైలీ వేజెస్, కంటిజెంట్ ఉద్యోగులను తక్షణమే రేగులరైజ్ చేయాలని తెలిపారు. 11వ పిఆర్సి ఒప్పందాలలో భాగంగా ఆర్థికపరమైన బకాయిలను, డీ ఏ, ఎరియర్స్ను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న నిధులకు భద్రత కల్పించాలన్నారు. పదవీ విరమణ గావించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, తాలూకా అధ్యక్షుడు శివయ్య ,కార్యదర్శి మహేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, వీఆర్వో సంఘం అధ్యక్షులు మహేశ్వరి, దేవి పెన్షనర్స్ సంఘ అధ్యక్షులు చలపతి, వివిధ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, రెవెన్యూ విభాగం తిరుపాల్, గ్రామ వార్డు సచివాలయం తరఫున రంగనాయకులు, మల్లికార్జున, శ్రీనివాసులు, గౌతమి, కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img