Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ రెవెన్యూ కార్యాలయం ఎదుట శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పార్ట్ టైం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కారం కావాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు విబి భాస్కర్ రెడ్డి కార్యదర్శి బాబాఫక్రుద్దీన్ పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల పట్ల నిరంకుషత్వంగా వ్యవహరిస్తున్నదని ఉద్యోగులకు రావలసిన సౌకర్యాలు అందడం లేదని ఉద్యోగుల యొక్క డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వము పరిష్కరించలేదని దశల వారి ఉద్యమాన్ని చేపడుతున్నామని వారు డిమాండ్ల గురించి తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగికి ఒకటవ తేదీననే జీతం చెల్లించే విధంగా చట్టము చేయాలని
పార్ట్ టైం, టైం స్కేల్, కాంట్రాక్ట్ బేస్, ఉద్యోగాలలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని
11వ పిఆర్సి ప్రకారము ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ప్రకారము ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని 12వ వేతన సవరణ గావించాలని జిపిఎఫ్ ఏపీ జి ఎల్ ఐ సొమ్ము కు భద్రత కల్పించాలని
ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణకు రావలసిన రిటైర్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి తమ యొక్క డిమాండ్లను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే విధంగా చూడాలని అలా చేయకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img