Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆర్ఓ ప్లాంట్ విరాళం.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చదువుతున్న విద్యార్థులకు ఆర్ఓ ప్లాంట్ ను ఓ దాత విరాళంగా ఇవ్వడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ ఈ ఆర్ వో ప్లాంటును గురువారం ప్రారంభించనున్నారని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్, రిజి స్టార్ ఎన్. వి. లక్ష్మయ్య, పెనుకొండ న్యాయవాది ప్రతాపరెడ్డి, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు వాసగిరి మురళి, బండి వేణుగోపాల్, గడ్డం పార్థసారథి రానున్నారని తెలిపారు.ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా వందలాదిమంది విద్యార్థులకు స్వచ్ఛమైన ఫిల్టర్ వాటర్ దొరుకుతుందని తెలిపారు. ఈ ఆరో ప్లాంట్లో ఒక గంటకు 500 లీటర్ల ఫిల్టర్ వాటర్ తయారవుతుందని, దీనివల్ల విద్యార్థులకు, అధ్యాపకులకు తాగునీటి కొరత ఉండదని వారు తెలిపారు. ఈ ఆర్వో ప్లాంటును కాలిఫోర్నియా- కైక గ్రూప్- సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వినోద్ అండ్ డాక్టర్ కైప ప్రసాదులు ఈ ప్లాంట్ ను విరాళంగా(ఆర్ఓ ప్లాంట్ విలువ రూ .1,20,000)ఇవ్వడం జరిగిందన్నారు. వీరి మిత్రులు జె. ప్రతాపరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పట్టణ విద్యావంతులు, కళాశాల తల్లిదండ్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img