Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థికి అమెరికాలో చదివే అవకాశం రావడం హర్షనీయం..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర `ధర్మవరం: యాన్యువల్ హాగ్ షిప్ ప్రోగ్రాం ఆఫ్ రెడ్ రోప్ అనే జాతీయస్థాయి శిబిరంలో ధర్మవరం పట్టణంలోని స్థానిక కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో బిఎ ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం.ఎస్ చరణ్ కు అమెరికాలో ఒక సెమిస్టర్ లో చదివేందుకు అవకాశం రావడం పట్ల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి అధ్యాపక బోధనేతర సిబ్బంది అభినందించి, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నివారణలో భాగంగా చతిస్గడ్ రాష్ట్రం ఒక ఉద్యమం చేపట్టిందని, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో కళాశాలలో ఏ ఒక్కరూ అక్రమ రవాణా దళారుల చేతులలో పడకుండా 16 మంది విద్యార్థులు రెడ్ రైడ్-2022 పేరిట 2,100 కిలోమీటర్లు స్ట్రైక్లింగ్ చేస్తూ 15 జిల్లాలలో 23 నవంబర్ నుండి డిసెంబర్ 10 వరకు పర్యటించడం జరిగిందన్నారు. అంతేకాకుండా చరణ్ సాయి ఇంగ్లీష్ ,హిందీ భాషల్లో అనర్గళంగా ఉపన్యసించినందుకు రెడ్ రోప్ ఉద్యమ సంస్థ ఎంపిక చేసినట్లు అభినందన సభలో ప్రకటించడం పట్ల కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందునా మన రాష్ట్రం నుండి ఇద్దరు విద్యార్థులు అమెరికాకు ఎంపిక కావడం,ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లా నుండి తమ కళాశాల విద్యార్థి చరణ్ సాయి ఎంపిక కావడం అందరికీ ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, అధ్యాపకులు చిట్టెమ్మ, షమీవుల్లా, పుష్పావతి, గౌతమి, భువనేశ్వరి, ఆనందు, రామ్మోహన్ రెడ్డి తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందము, తోటి విద్యార్థులు కూడా పాల్గొని చరణ్ సాయి కి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img