Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ప్రభుత్వ భూ సాగులో ఉన్న రైతులకు డి పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలి…

ఆర్డిఓ కి సిపిఐ వినతి…

విశాలాంధ్ర-గుంతకల్లు : రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వ భూములకు డి పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని సోమవారం ఆర్డీవో కార్యాలయంలో సిపిఐ నాయకులు స్పందన కార్యక్రమంలో ఆర్డిఓ రవీంద్రా కి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి,సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ… ఎన్నో సంవత్సరాలుగా గుంతకల్లు నియోజవర్గంలో చిన్న కారు రైతులు వారికున్న భూమి చాలక ప్రభుత్వ భూముల్లో, గుట్టల్లో, గుంతల్లో ,పరంబోగు, శివాజనమా తదితర భూముల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా మార్చుకొని రైతులు పంటలు పండించుకుంటున్నారు. ఈ ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకున్న బ్యాంకుల నుండి ఎటువంటి రుణం, నష్టపరిహారం తదితర వాటిపై సహాయం లేక రైతులు నష్టం చెవి చూస్తున్నారని అన్నారు. రైతన్నలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం రైతులకు (డీ )పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అందులో భాగంగా రీ సర్వేలు కూడా నేటికీ జరిగాయన్నారు. కానీ ఇప్పటివరకు (డీ)పట్టా పాస్ పాసు బుక్కులు ఇవ్వలేదన్నారు. నియోజవర్గంలోని గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో సాగు చేసుకుంటున్నా రైతులకు పట్టా పాస్ బుక్కులు అందజేసి బ్యాంకుల నుండి రైతులు లబ్ధి పొందేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఐ నాయకులు ఆటో శివా,గురు స్వామి ,గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img