Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రైవేట్ పాఠశాలల అక్రమ అడ్మిషన్లు, ప్రచారాలు ఆపండి..

ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఆర్ యు ఎస్ యు.. విద్యార్థి సంఘాలు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విచ్చల వీడిగా అడ్మిషన్లు, ప్రచారాలు చేస్తున్న.. చూసి, చూడనట్లు ఎంఈఓ ఉండడం సరైన పద్ధతి కాదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నామాల నాగార్జున, జిల్లా అధ్యక్షులు ఆర్ యు ఎస్ యు పిక్కరి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ఎంఈఓ ఆఫీస్ కార్యాలయానికి విద్యార్థి సంఘం నాయకులు చేరుకోగా, అక్కడ ఎంఈఓ సుధాకర్ నాయక్ లేకపోవడంతో వారి కుర్చీకే వినతి పత్రాన్ని వినూత్న రీతిలో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తప్పుదారి పట్టిస్తూ, ముందస్తు ప్రచారాలు, అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంలో మండల విద్యాశాఖ అధికారి విఫలమయ్యారనీ మండిపడ్డారు.ప్రధానంగా మండల ధర్మవరం పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు ప్రచారాలు, అడ్మిషన్లు చేస్తూ ధర్మవరం పట్టణంలో పలు చోట్లోఫ్లెక్సీలు కూడా వేసి, ప్రచారం చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను డిస్కౌంట్, ఆఫర్ల పేర్లతో అనేక రూపాలలో విచ్చలవిడిగా ఫీజుల రూపంలో డబ్బులు దండుతున్నారనీ ఆరోపించారు. కావున తక్షణం అలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంను ఎంఈఓ కుర్చీకి ఇవ్వడం జరిగిం దన్నారు. ఇకనైనా ఎంఈఓ సకాలంలో దాడులు చేయకపోతే, విద్యార్థి సంఘములు ఉదృత పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img