Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఫిబ్రవరి 13 నుండి 24 వరకు రాష్ట్ర సిపిఐ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన

  • సీపీఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.గోవిందు….

విశాలాంధ్ర-గుంతకల్లు : కేంద్ర ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్టుకు 5300 కోట్లు బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం చేసిందని సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి గోవిందు అన్నారు శనివారం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను వైయస్సార్ పార్టీ ప్రభుత్వం మరమ్మత్తులు కానీ అభివృద్ధి కానీ ఏమైనా చేసిందా ? సాగునీటి ప్రాజెక్టులు ద్వారా నీరు ప్రవహించే కాలువలు బాగున్నాయా లేదా ప్రాజెక్టుల నుండి పంట పొలాలకు పోయే డిస్ట్రి బ్యూటరీలు నుండి పనిచేస్తున్నాయా లేదా డ్యాములలోకి వచ్చే నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు చేస్తున్నారా లేదా ప్రాజెక్టులు నిర్మాణం వల్ల నిర్వాసితులైన ప్రజలకు ప్రభుత్వం పరిహారం చెల్లించినదా లేదా తదితర విషయాలు ప్రతినిధి బృందం పరిశీలించి మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల కన్నా ముందుగా ప్రభుత్వానికి సిపిఐ పార్టీ పూర్తిగా నివేదికలు సమర్పిస్తుందని తెలిపారు. ఈ పరిశీలనలో ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే.వి సత్యనారాయణ మూర్తి ,సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఓబులేసు ,దేవరగుడి జగదీష్ ,జి.ఈశ్వరయ్య,పి.రామచంద్రయ్య ,ప్రసాద్ ,అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్ ,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, మల్లికార్జున ,ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు, కార్యదర్శి చెన్నప్ప యాదవ్ పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఈనెల 13వ తారీఖున తుంగభద్ర డ్యామ్ నుండి పర్యటన పరిశీలన ప్రారంభమవుతుందని అక్కడినుండి ఎగువ భద్ర బీటీపీ ప్రాజెక్టు పిఎబిఆర్ జీడిపల్లి హెచ్ ఎన్ ఎస్ సి గుంతకల్లు రాత్రి బస ఉంటుందన్నారు. అనంతరం 14 వ తారీకు వేదవతి గుండ్రేవుల ఆర్డీఎస్ మల్లెల లిఫ్ట్ ముచ్చుమర్రి ఎత్తిపోతల సిద్దేశ్వరం పోతిరెడ్డిపాడు బనకచర్ల వెలుగోడు నంద్యాలలో రాత్రి బస ఉంటుందన్నారు. అనంతరం 15వ తారీఖున రాజోలి బ్రహ్మ సాగరం కడప గండికోట వెలిగల్లు రాయచోటి మదనపల్లిలో రాత్రి బస ఉంటుందన్నారు. అనంతరం 16వ తారీఖున మదనపల్లి హెచ్ ఎన్ ఎస్ ఎస్ తిరుపతి జి ఎన్ ఎస్ ఎస్ కర కంబాడి సోమశిల అనంతరం మార్కాపురంలో రాత్రి బస ఉంటుందన్నారు 17వ తారీఖున వెలుగొండ టన్నెల్ నిర్వాసితుల సదస్సు అనంతరం రాత్రి విజయవాడలో బస ఉంటుందన్నారు 20 తారీఖున చింతలపూడి పోలవరం 23న పలాస ప్రారంభం ఆఫ్షోర్ రిజర్వాయర్ హీర మండల రిజర్వాయర్ తోటపల్లి ప్రాజెక్టు అనంతరం విజయనగరంలో రాత్రి బస ఉంటుందన్నారు 24న ఎన్టీఆర్ ప్రాజెక్టు బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనంతరం అనకాపల్లిలో ముగింపు అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img