Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించడంలో అన్యాయం

జిల్లా దళిత హక్కుల పోరాట సమితి కార్యదర్శి మల్లికార్జున

విశాలాంధ్ర- ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు బడ్జెట్ లాగానే ఈ సంవత్సరం కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేసిందని జిల్లా దళిత హక్కుల పోరాట సమితి కార్యదర్శి జే మల్లికార్జున పేర్కొన్నారు మంగళవారం ఉరవకొండ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 16.4% ఎస్సీలు 5.3% ఎస్టీలు ఉన్నప్పటికీ జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరగలేదన్నారు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కోతలు విధించుకుంటూ పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు 2019 నుంచి 2022 వరకు ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు కేటాయింపులలో ఎస్సీలకు రూ, 16, వేలు కోట్లు, ఎస్టీ నిధులు కేటాయింపులలో రూ,4 వేలు కోట్లు కోత విధించారని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయడంలో అలసత్వం వహించారని పేర్కొన్నారు. కాంపోనెంట్ నిధులను ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధికి ఉపయోగించాలని చట్టం చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పథకాలకు దారి మళ్ళించి ఎస్సీ, ఎస్టీలను మరింత మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ కు సంక్షేమ పథకాలు,రుణాలు రాయితులు లేని రాష్ట్ర బడ్జెట్ నిస్సారమైందని పేర్కొన్నారు ఎస్సీ కార్పోరేషన్కు కేటాయించిన రూ.8,384 కోట్లు సబ్సిడీ రుణాలు, వడ్డీ రాయితులు ఇతర స్వయం ఉపాధి కోసం ఉపయోగించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img