Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బలగం,సినిమాను ఆదరించండి…ఎమ్మెల్యే వై.వి ఆర్

విశాలాంధ్ర-గుంతకల్లు : దిల్ రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి హర్షిత నిర్మించిన సినిమా బలగం దర్శకుడు వేణు గురువారం గుంతకల్లు పట్టణంలోని చైతన్య థియేటర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ,ఎమ్మెల్సీ శివరాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలగం చిత్ర బృందం హీరో ప్రియదర్శి పులికొండ, హీరో హీన్ కావ్య కళ్యాణ్ రామ్, కమెడియన్ రచ్చ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవిఆర్, ఎమ్మెల్సీ శివరాం రెడ్డి,దర్శకుడు వేణు,హీరో ప్రియదర్శి మాట్లాడుతూ దిల్ రాజు కొత్త విధానంతో ఉన్న మంచి సినిమాలు తీసుకుంటాడని అందులో భాగంగానే హర్షిత్ రెడ్డి బలగం సినిమా అద్భుతంగా ఉందని మంచి కంటెంట్ కంటతడి ఉన్న సినిమా మొట్టమొదటిసారిగా దిల్ రాజు పేరుతో దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్ను స్థాపించి అంత కొత్త వారితో సినిమా చేశారంటే ఏదో విషయం లేకుండా చేయరు అనుకున్నానని అన్నారు. అయితే ఈ సినిమా విజయం నా అంచనాను కు మించి నిజం చేసిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన వారంతా ప్రేక్షకులందరూ ఆదరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్ ,చైర్మన్ యుగంధర్, చైతన్య థియేటర్ యాజమాని సాయి, చిత్ర యూనిట్, చైతన్య థియేటర్ సిబ్బంది పవన్ సంజీవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img