విశాలాంధ్ర^ ఉరవకొండ : ఉరవకొండ మండలం నింబగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో శుక్రవారం బాలికలు, మరియు వారి తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు ఉపాధ్యాయుడిని రూములో బంధించి దేహశుద్ధి చేయడానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న ఉరవకొండ పోలీసులు హుటాహుటిన పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలికలు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు తరచూ బాలికలతో వెక్కిలి చేష్టలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలికల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఉరవకొండ పోలీసులు విచారణ చేపట్టారు