Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బిజెపి వైయస్సార్ పార్టీలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ రాష్ట్రంలో ఏకం కావాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ …

విశాలాంధ్ర-గుంతకల్లు : నిరంకుశ అరాచక పాలన చేస్తున్న వైయస్సార్ పార్టీని అధికారం నుండి గద్దె దింపడానికి రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ అన్నారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ…యువగలం పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం పట్ల పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 175 ఎమ్మెల్యే సీట్లలో 151 కేవలం వైయస్సార్ పార్టీ నీ గెలిపించడం వల్లే జగన్ సైకో మాదిరిగా తయారయ్యాడని విమర్శించారు. ప్రతిపక్షాలు టిడిపి, సిపిఐ ,సిపిఎం, పార్టీలను కూడా ప్రజలు ఆదరించి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అసెంబ్లీలో ఈరోజు కమ్యూనిస్టులు లేనందువల్ల చాలా స్పష్టంగా బందల దొడ్డి గా అసెంబ్లీ తయారయిందని సీఎం పొగడ్తలకే అసెంబ్లీ సమావేశాలు పరిమితమై నాయి అక్కడ ఎలాంటి ప్రజల సమస్యలు నిర్దిష్టంగా చర్చించడం లేదన్నారు. అందులో ఎమ్మెల్యే లు అందరూ డూ డు బసవన్న లాగా మారారన్నారు. అసెంబ్లీకి ఉన్న ప్రతిష్టను దిగజారుస్తున్నాడని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు రాజధాని అమరావతిని ధిక్కరిస్తున్నాడు. అమరావతి రాజధాని మార్చడం పై హైకోర్టు కూడా అంగీకరించలేదని అన్నారు.ఈ పోకడాలన్నీ రెండు,మూడు ప్రతిపక్షాలు అసెంబ్లీలో లేనందువలన వైసిపి ఎమ్మెల్యేల ఆగడాలు కొనసాగుతున్నాయి రాబోయే ఎన్నికలలో వైయస్సార్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలి అందుకే యువగలం పాదయాత్రను ప్రజలందరూ ఆదరిస్తున్నందువల్ల ఇది సంతోషకరంగా ఉందని అన్నారు. వైయస్సార్ పార్టీ నీ అధికారంలో నుంచి చరమగీతం పాడేందుకు ప్రతిపక్షాలు అన్ని ఏకమై నిరంకుశ అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలని తెలియజేశారు.రాహుల్ గాంధీ పైన అనార్హత వేటు వేసినందువల్ల కూడా కమ్యూనిస్టులు అందరూ ఢిల్లీలో వ్యతిరేకిస్తూ సిపిఐ ,సిపిఎం పార్టీలు పోరాడుతున్నాయని అన్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో చేయవలసిన పని కాదు అందువల్లనే కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అన్ని ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలు టిడిపి ,జనసేన లతో సహా కలిసి రావాలని కోరారు. రాహుల్ గాంధీ కి చేసినట్లే ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా నియంతృత్వంగా అనర్హత వేటు వేసే ప్రమాదం ఉంది దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వరం పెంచాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ ఎండి గౌస్ ,సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img