Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బెస్తలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

జిల్లా బెస్త సంఘం అధ్యక్షులు కే.వి.రమణ
విశాలాంధ్ర`ఉరవకొండ : అత్యధిక శాతం జనాభా కలిగి ఉన్న బెస్త కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రాధాన్యతను కల్పించాలని బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు కె.వి.రమణ అన్నారు. గురువారం ఉరవకొండ నియోజకవర్గం బెస్త సేవా సంఘం సర్వసభ్య సమావేశం బెస్త తిప్పయ్య అధ్యక్షతన వాల్మీకి కళ్యాణమండపం నందు జరిగింది. అంతకుముందు ఉరవకొండ మార్కెట్‌ యార్డ్‌ నుంచి బెస్తల కులదైవమైన గంగమ్మ దేవాలయం లో పూజలు నిర్వహించి, అక్కడి నుంచి ప్రదర్శనగా వందలాదిమంది బెస్తలు ఐక్యత వర్ధిల్లాలని, బెస్తలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలని, అన్ని స్థాయిలలో రాజకీయంగా పోటీలు చేయడానికి బెస్తలు సంసిద్ధులు కావాలని, జై బెస్త, అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బెస్త సేవా సంఘం అధ్యక్షులు కె.వి రమణ, తో పాటు గౌరవ అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, చంద్రబాబు, నాగేంద్ర, గంగప్ప, నాగరాజు ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ అనాదిగా బెస్తలను ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే గాని రాజకీయంగా బెస్తలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చివరకు వారి కులవృత్తి అయిన మత్స్య వృత్తిని కూడా కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారిపోయి గర్భ దరిద్రంలో బ్రతుకుతున్నారని, ఇక భవిష్యత్తులో ఏమాత్రం ఈ పరిస్థితులను సహించేది లేదని రాబోయే కాలంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు బెస్తలకు రాజకీయాలలో సముచిత స్థానాన్ని కల్పించకపోతే తగిన బుద్ధి చెబుతామని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బెస్తల కులదైవమైన గంగమ్మ దేవాలయం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలను కేటాయించాలని డిమాండ్‌ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బెస్త సంఘం నాయకులు వెంకటేశులు, హెల్త్‌ రమణ, రామన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉరవకొండ నియోజకవర్గం బెస్త సేవా సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నియోజకవర్గం అధ్యక్షులుగా బెస్త తిప్పయ్య, కార్యదర్శులుగా ఎం. ఎర్రి స్వామి( మరుట్ల) వన్నూరు స్వామి (విడపనకల్లు) కోశాధికారిగా బెస్త సర్వేష్‌ (ఉరవకొండ) గౌరవాధ్యక్షులుగా రామాంజనేయులు (ఉరవకొండ) రామన్న (ఉరవకొండ) నాగన్న (ప్యాపిలి)ఎర్రిస్వామి (విడపనకల్లు) వీరితో పాటుగా ప్రతి మండలం నుంచి 5 మంది ఉపాధ్యక్షులు 5 మంది సహాయ కార్యదర్శులు మొత్తం 56 మందితో నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత మండల కమిటీలను, గ్రామ కమిటీలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img