Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు

విశాలాంధ్ర-రాప్తాడు..మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పురోహితులు ఉదయాన్నే ఆలయాలను శుద్ధిచేసి దేవుళ్లను అలంకరించారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ఃమార్గంః మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుందని పురోహితులు తెలిపారు. మండల కేంద్రం సమీపంలోని శ్రీ లక్ష్మీ పండమేటి వెంకటరమణ స్వామి వారిని, లక్ష్మీదేవి అమ్మవారిని ఫలపుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వైకుంఠ ఉత్తర)ద్వారం ద్వారా భక్తులు తెల్లవారుజాము నుంచే భగవద్దర్శనార్థం చేసుకున్నారు. తర్వాత భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు గంజి చిట్టిరాముడు, సభ్యులు ముత్యాలవెంకటరాముడు, పంపు నారాయణ, ఎల్ఐసీ వెంకటరాముడు, సాకే నారాయణ, మాన్లుకోసే మారుతీ, జూటూరు రాజన్న, తలారి నాగరాజుతోపాటు పాటిల్ చంద్ర, దాసరి భూషణ, సాకే ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు, కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img