Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారత రక్షణ శాఖకు అనంత మెడికల్‌ కళాశాల 2,03,553 రూపాయల విరాళం

భారతదేశంలోనే అత్యధిక విరాళం అందించిన విద్యాసంస్థగా అనంత ప్రభుత్వ వైద్య కళాశాల
మెడికోల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం
వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య డాక్టర్‌ మైరెడ్డి నీరజ

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మైరెడ్డి నీరజ అధ్వర్యంలో జాతీయ సేవా పథకం సెల్ఫ్‌ ఫైనాన్స్‌ యూనిట్‌ సమన్వయంతో ,కులమతాల ఘర్షణల వల్ల గాని, టెర్రరిస్టులు దాడుల వల్ల గాని తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన అనాధ బాలబాలికల వసతి భోజన వైద్య విద్య సదుపాయాల కొరకై వారిని సంరక్షిస్తున్న భారతదేశ రక్షణ శాఖ స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ కమ్యూనల్‌ హార్మోని కు వైద్య విద్యార్థులు వారితో సహా, డాక్టర్లు, వైద్య ఉపాధ్యాయులు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యార్థులు, హౌస్‌ సర్జన్లు, స్టాఫ్‌ నర్సులు, నర్సింగ్‌ పారామెడికల్‌ వైద్య విద్యార్థిని విద్యార్థులు అందరికీ కులమత సామరస్యాల పై అవగాహన కల్పించి అనాధ బాలబాలికలకు 2,03,553 (రెండు లక్షల మూడువేల ఐదువందల యాభై మూడు రూపాయలు) కలెక్ట్‌ చేసి ఎన్‌ ఎఫ్‌ సి హెచ్‌ సంస్థకు ఆర్టిజిఎస్‌ ద్వారా డబ్బులు పంపించడం జరిగినది. భారతదేశంలోని ఇంత పెద్ద మొత్తాన్ని ఇంతవరకు ఏ కళాశాలల్లో యూనివర్సిటీలలోని విద్యార్థులు కలెక్ట్‌ చేసి పంపించడం జరగలేదు. అనాధ బాల బాలికలు సహాయం చేసిన అతి పెద్ద మొత్తం ఆంధ్రప్రదేశ్లోని, ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం చేసింది అని చెప్పడానికి గర్వపడుతున్నాననీ,రానున్న సంవత్సరాలలో అనాధ బాలబాలికలకు వారి సంరక్షణకు మరింత మంది విద్యార్థులలో స్ఫూర్తిని నింపి మనకోసం మనం మాత్రమే కాకుండా సమాజంలో భాగస్వామ్యమై సమాజానికి తమ వంతు సహకారాన్ని చేసే విధంగా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు ను మెడికల్‌ కళాశాల జాతీయ సేవా పథకం తరఫున నిర్వహించబోతున్నామని ప్రిన్సిపల్‌ నీరజ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా వెయ్యి మందికి పైగా వారికి తోచిన విధంగా డబ్బులను కళాశాల జాతీయ సేవా పథకానికి అందించిన, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎన్‌ ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం అధికారి ఆదిరెడ్డి పరదేశి నాయుడు మాట్లాడుతూ ఇంతవరకు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజ మేడం గారి అధ్వర్యంలో సుమారుగా ఈ సంవత్సరం తో కలిపి ఆరు పర్యాలలో 4 లక్షలకు పైగా డబ్బును నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ కమ్యూనల్‌ హార్మోని అనే సంస్థకు పంపించడం జరిగిందని, ఇంత పెద్ద మొత్తంలో డొనేషన్‌ అందించిన అతి ఉత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దడంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజ, వైద్య అధ్యాపకులు, మెడికోల పాత్ర ఎంతగానో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేఎల్‌ సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ వేముల సరోజ, డాక్టర్‌ బసిరెడ్డి ప్రవీణ, డాక్టర్‌ ప్రియాంక, డాక్టర్‌ పునర్జీవన్‌ కుమార్‌, డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, డాక్టర్‌ షహజీర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, 2022 బ్యాచ్‌ వైద్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img