Friday, April 19, 2024
Friday, April 19, 2024

మంచి ఉత్తీర్ణత వచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలి.. ఆర్ ఐ ఓ సురేష్ బాబు

విశాలాంధ్ర – ధర్మవరం : ఈ ఏడాది ఇంటర్లో మంచి ఉత్తీర్ణత శాతం వచ్చేలా అధ్యాపకులు మంచి కృషి చేయాలని, విద్యార్థినీలు కూడా సమయం వృధా చేయకుండా చదువు మీద ధ్యాస తప్పనిసరిగా పెట్టాలని ఆర్ఐఓ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో వారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం కళాశాలలో ఉన్న ల్యాబ్ ను పరిశీలించారు. కొద్దిసేపు విద్యార్థినీలతో ముఖాముఖి నిర్వహించి, చదువుటలో తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. ప్రతి విద్యార్థిని కష్టపడి, ఇష్టపడి చదివినప్పుడే మంచి ఫలితం లభిస్తుందని తెలియజేశారు. అధ్యాపకులు కూడా విద్యార్థినీలను వారి అర్హత బట్టి ,చదువును మరింత నైపుణ్యం కలిగించేలా కృషి చేస్తూ, నూటికి నూరు శాతం ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మి కాంత్ రెడ్డి తోపాటు అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img