Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంత్రి పర్యటనను అడ్డుకుంటారని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అరెస్ట్‌

విశాలాంధ్ర`ఉరవకొండ : అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉరవకొండ పట్టణంలో జరిగే వైఎస్‌ఆర్సిపి పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు అవుతుండడంతో మంత్రి పర్యటన అడ్డుకుంటారని ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు ఎం రాజును ప్రధాన కార్యదర్శి కౌకుంట్ల రవి, ఉరవకొండ తాలూకా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు గౌరవ అధ్యక్షులు గంగాధర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు వెంకటేశులు, మారుతీలను ఉరవకొండ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అములు పైన రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, దళిత మహిళలపై జరుగుతున్న అఘైత్యాలు పైన ఎక్కడ ప్రశ్నిస్తారోనని ముందస్తుగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ పోరాటాల నిర్వహిస్తున్న వారిపై అక్రమం కేసులు, అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటివి మంచి పద్ధతి కాదన్నారు దళితుల హక్కులను ఎవరు కాలు రాసిన తమ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img