Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మసీదులు పరిసర ప్రాంతాల్లో క్లీన్ అండ్ గ్రీన్

విశాలాంధ్ర-ఉరవకొండ : ముస్లింల పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభం ప్రారంభం కానున్న దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉరవకొండ పట్టణంలోని ఉన్న అన్ని మసీదుల పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపచెట్లను మరియు చెత్త చదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేయిస్తున్నట్లు ఉరవకొండ పట్టణ ముస్లిం మైనార్టీ ప్రజా ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఉరవకొండలో వారి విలేకరులతో మాట్లాడుతూ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి యొక్క సూచనలతో గ్రామపంచాయతీ సర్పంచ్ లలితమ్మ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు పామిడి సలీం, ఒకటవ వార్డు సభ్యులు శర్మ, రెండవ సచివాలయ కన్వీనర్ మద్దికేరి అన్వర్ వైసిపి మైనార్టీ నాయకులు తాజు,ముల్లా ఇంతియాజ్ మరియు షాకీర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img