Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళలకు అసరా చెక్కుల పంపిణీ

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండల కేంద్రం నందు గురువారం మార్కెట్ యార్డు నందు మహిళలకు వైయస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక రూపాలలో మోసాలు చేసి ఓట్లు దండుకోవడం తప్ప చేసిన మేలు ఏమీ లేదని దుయ్యబట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు మహిళలు పడుతున్న కష్టాలు చూసి చెల్లించి మహిళలకు అనేక పథకాలను రూపొందించారు అమ్మఒడి మహిళలకు ఆసరా శీ వడ్డీ జగనన్న తోడు శ్రీనిధి రుణాలు ఇప్పిచ్చి మహిళలకు అనేక రకాలుగా చేతనందిస్తున్నారు వీటిని ఓర్చుకోలేక ప్రభుత్వంపై అనేక రకాలుగా బురద జలుతున్నారని వీటన్నిటిని మహిళలు నమ్మే పరిస్థితిలో లేరని ఎవరి ప్రభుత్వ హయాంలో ఎక్కువ లబ్ధి పొందామని గుర్తుపెట్టుకుని మహిళలు మరల సహాయం చేసిన వ్యక్తికి అండగా నిలుస్తారని తెలిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా అనేక రకాలుగా దోచుకున్నారని జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కులం లేదు మతం లేదు పార్టీ లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి వాలంటరీ పద్ధతిని మరియు సచివాలయ వ్యవస్థను రూపకల్పన చేసి మీ గ డపకే సంక్షేమ కార్యక్రమాలు అందించే బాధ్యత భుజాన వేసుకున్నాడని కావున మరల అబద్ధాలు చెప్పే నాయకులు వస్తారని వారిని నమ్మకూడదని కావున స్త్రీల చైతన్యవంతులైనప్పుడే వారి కుటుంబము సమాజము బాగుంటుందని మేలు చేసిన వారిని మరవకూడదని ఉద్దేశంతో మరల దీవించాలని కోరారు అలాగే మండల వ్యాప్తంగా 1265 మహిళా సంఘాలకు కాను 6.28 కోట్లు మంజూరైనట్లు ఇప్పటివరకు మూడో విడతలలో 18.85 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు జమయాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గీత రామ్మోహన్ రెడ్డి వైస్ ఎంపీపీ రామాంజనేయులు సర్పంచులు శ్రీకాంత్ రెడ్డి ఆదినారాయణ సాయి రామ్ నాయక్ ఎంపీటీసీ నిర్మల నారాయణస్వామి ఎంపీడీవో శివ శంకరప్ప ఏపిఎం రవీంద్రారెడ్డి రాజగోపాల్ రెడ్డి సమైక్ లీడర్లు మహిళా సంఘాల నాయకురాలు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img