Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మహిళలు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుద్దాం..

మిస్సెస్ ఇండియా టైటిల్ విజేత డాక్టర్ సుప్రజ

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : మహిళలందరూ అన్నిరంగాల్లో ఎదుగుతూ అనేక మందికి ఆదర్శంగా నిలుద్దామని మిస్సెస్ ఇండియా టైటిల్ డాక్టర్స్ సుప్రజ, పిలుపునిచ్చారు. కుందుర్పిలో అభయ ఫౌండేషన్ సహకారంతో ఎస్కేచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితటైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు . శనివారం మిస్సెస్ ఇండియా టైటిల్ విజేత డాక్టర్ సుప్రజ,అనంతపురం జిల్లా చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ హేమలత,ఎస్.కె చారిటబుల్ వ్యవస్థాపకులు ప్రముఖ గాయకుడు లెనిన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటికంప్యూటర్ సమాజంలో గ్రామీణప్రాంతాల్లో అనేక కుటుంబాలు ఉన్నత చదువులు చదువుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు ప్రధానంగా మహిళలు స్వయం ఉపాధితో బాసటగా నిలవాలన్నారు.
అత్యంత వెనుక ఉన్న మండలంలో అనేక మంది మహిళల కోసం ఎస్.కె చారిటబుల్ ట్రస్ట్ సమక్షంలో అభయ ఫౌండేషన్ సహకారంతో ఉచిత శిక్షణ తీసుకొట్టున్న మహిళలందరూ అవకాశాని సద్వినియోగం చేసుకొవాలంన్నారు.అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవవేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి మహిళలకు పంచి సంబరాలు చేసుకున్నారు. అంతరం సింగల్ విండోసొసైటీ ఆవరణంలో మొక్కనాటారు.
ఈకార్యక్రమంలో ఎస్.కె చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు టి.రాజు,ప్రోగ్రాం కోఆర్డినేటర్ దిలీప్ కుమార్,శిక్షకురాలు అంబుజా,చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉమాదేవి,యశోద, సావిత్రమ్మ,శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img