Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహిళా ప్రపంచం మేలుకొని మహిళ హక్కుల కోసం పోరాడండి…

కాబోయే తరాల మహిళలకు రక్షణగా నిలుద్దాం…

విశాలాంధ్ర-గుంతకల్లు : దేశంలో ఈనాటికి మహిళలకు స్వేచ్ఛ లేదని ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఈ అఘాయిత్యాలు మహిళలపై జరుగుతూనే ఉన్నాయని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా హక్కుల సాధనకై రాబోయే తరాల మహిళలకు రక్షణగా నిలుద్దామని ఏపీ మహిళా సమైక్య నియోజవర్గం కార్యదర్శి రామాంజనమ్మ మహిళలకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని సిపిఐ పార్టీ ఆవరణంలో ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమాన్ని నియోజవర్గం కార్యదర్శి రామంజినమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ మహిళ సమైక్య జెండా పథకాన్ని ముఖ్య అతిథులు సిపిఐ 26 వార్డు కౌన్సిలర్ బోయలక్ష్మి ఆవిష్కరించారు. ముఖ్య అతిథులు సిపిఐ నియోజవర్గం కార్యదర్శి బి.మహేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోయ లక్ష్మి ,రామంజినమ్మ మాట్లాడుతూ… ఆవనిలో సగం ఆకాశంలో సగం అన్నింట సగం అయినా మహిళల హక్కుల కోసం బానిస సంకెళ్లు తెంపుకుని మహిళల చైతన్య స్ఫూర్తితో స్త్రీలకు స్వేచ్ఛగా ఉండేందుకు ఆర్థిక రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఈ నాటికి ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదని అన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఆడ పుట్టుల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు.దుర్బర దుస్థితి నుండి వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రపంచం మేలుకొని మహిళల హక్కుల కోసం రాబోయే తరాల మహిళలకు రక్షణ నిలిచేందుకు పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి శాంతమ్మ ,గుత్తి మండల కార్యదర్శి మహమూద ,పట్టణ మహిళా సభ్యులు సబీనా శశికళ, రేణుక ,అక్షయ ,సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌడ్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు పిసి కుల్లాయప్ప, సిపిఐ నాయకులు మల్లయ్య ,పుల్లయ్య,ఏఐఎస్ ఎఫ్ నియోజికవర్గం ఆర్గెనేజింగ్ కార్యదర్శి వినోద్ ,ఏఐఎస్ ఎఫ్ పట్టణ కార్యదర్శి చంధ్ర,పట్టణ నాయకులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img