Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహిళా సంఘాల అభివృద్ధి ప్రభుత్వం యొక్క లక్ష్యము.. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం:: మహిళా సంఘముల అభివృద్ధి ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో మూడవ ఆసరా విడతలో భాగంగా మెగా చెక్కు మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాలుగా మహిళ సంఘాల అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని, ఈ మహిళా సంఘంలోని సభ్యుల కుటుంబాలు అన్నియు కూడా అభివృద్ధి బాటలో నడవడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఈ ఆసరా లో విడుదలైన నగదును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మొత్తం రూరల్ పరిధిలో ఆసరాలో 794 మహిళా సంఘాలు ఉన్నాయని ఇందులో 7,934 మహిళా సంఘ సభ్యులకు ఆరు కోట్ల 48 లక్షలు వారి వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు. వైయస్సార్ ఆసరా తోని ఆర్థిక స్వాలంబన లబ్ధి చేకూరుతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాత అని, ఎన్నికలకు ముందు స్వయం సహాయక మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వారు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘం సభ్యులు తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మేరకు నేటికీ మూడు విడతల్లో రుణాలకు సంబంధించిన చెక్కులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని 2024లో కూడా మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. తదనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే తో పాటు మహిళా సంఘం లీడర్లు సంఘం సభ్యులు పాలాభిషేకము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, ఏపీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఓబిరెడ్డి, ఎంపీపీ గిరక రమాదేవి, వైఎస్ ఎంపిపి పాటిల్ కృష్ణారెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, తహసిల్దార్ యూగేశ్వరి దేవి, ఏరియా కోఆర్డినేటర్ రామేశ్వర్ రెడ్డి,ఏపీఎం లక్ష్మీనారాయణ, వైయస్సార్ క్రాంతి పథ సిబ్బంది, గ్రామ సంఘ నాయకులు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img