Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మహిళ మృతి పై విచారణ జరపాలి – సిపిఐ

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం వి. కొత్తకోట గ్రామానికి చెందిన పద్మావతి అనే వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిందని దీనిపై విచారణ జరపాలని సిపిఐ పార్టీ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉరవకొండ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, పార్టీ నాయకులు మరియు మృతి చెందిన పద్మావతి కుటుంబ సభ్యులతో కలిసి ఇంచార్జ్‌ ఎస్‌ఐ వెంకటస్వామి ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జ్వాహారాపురం గ్రామానికి చెందిన సుంకమ్మ మరియు లింగన్న దంపతులు కుమార్తె పద్మావతిని విడపనకల్లు మండలం వి. కొత్తకోట గ్రామానికి చెందిన జింక ఆంజనేయులు కుమారుడు సంజీవ్‌ కి ఇచ్చి వివాహం చేయడం జరిగిందని అయితే గడిచిన మూడు సంవత్సరాల కాలంలో పద్మావతిని అనేక చిత్రహింసలకు గురి చేశారని గతంలో ఒకసారి ఆమెను గొంతు నులిమి చంపడానికి కూడా ప్రయత్నించడం జరిగిందని గతంలో తప్పించుకోవడం జరిగిందని అయితే ఈనెల ఒకటవ తేదీ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో భర్త సంజీవ, బంధువులు లక్ష్మీనారాయణ వెంకటలక్ష్మి కలిసి తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తమకు అనుమానాలు ఉన్నాయని జరిగిన ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని పద్మావతి తల్లి సుంకమ్మ తండ్రి లింగన్న మరియు సిపిఐ పార్టీ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పద్మావతి మృతికి కారకులైన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ తాలూకా సహాయ కార్యదర్శి మనోహర్‌, జిల్లా ఏఐటీయూసీ నాయకులు చెన్నారాయుడు, పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీధర్‌,మల్లేష్‌, సుల్తాన్‌ రమేష్‌, మల్లికార్జున గౌడ్‌, వన్నూరమ్మ,నూర్జహాన్‌, జ్వాహరాపురం సర్పంచ్‌ నెల్లూరప్ప, మృతి చెందిన పద్మావతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img