Friday, April 19, 2024
Friday, April 19, 2024

మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అని వినతి

విశాలాంధ్ర -పెనుకొండ : సోమందేపల్లి మండలం ఈదుల బల్లాపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా వైసీపీలో వర్గ పోరు నడుస్తున్నది ఈనెల 1వ తేదీన ఆ గ్రామానికి సంబంధించిన అసమ్మతినేత నాగభూషణ్ రెడ్డి ఎమ్మెల్యే కాన్వాయ్ పై చెప్పులతో దాడి చేయించాడని అతని మీద సోమందేపల్లి పోలీసులు 14వ తేదీన నాగభూషణ్ రెడ్డి మరి అతనీ అనుచరుల మీద కే సుబనాయించి సబ్ జైలుకు పంపించారు అతను 18వ తేదీ జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యారు తమ నేత జైలు నుండి విడుదల కాగానే గ్రామంలో తన అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుని బాణాసంచా విపరీతంగా కాల్చి హంగామా చేశారు అందులో భాగంగా నాగభూషణ్ రెడ్డి వ్యతిరేక వర్గం ఆదినారాయణ రెడ్డి సింగల్ విండ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు రాత్రి 12 గంటల సమయంలో ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన 10 ట్రాక్టర్ల గడ్డివాముకి ప్రత్యర్ధులు అగ్గి పెట్టి ఉంటారని దాని వలన 4 చింత చెట్లు గడ్డి పూర్తిగా దహనం అవడంతో దాదాపుగా 1,5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామంలో ప్రశాంత వాతావరణం లేదని వర్గ కక్షలు పెరిగే అవకాశం ఉందని సోమవారం ఆదినారాయణ రెడ్డి తన వర్గీయులతో కలిసి డిఎస్పి హుస్సేన్ పీరా సీఐ కరుణాకర్ తో కలిసి మా గ్రామంలో నెలకొన్న అశాంతిని పోగొట్టాలని నాకు జరిగిన నష్టాన్ని గుర్తించి నిందితులను గుర్తించి నాకు న్యాయం చేయాలని డి.ఎస్.పి కి వినతి పత్రాన్ని సమర్పించారు, డీఎస్పీ కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగడం లేదు ఆ ఒక్క గ్రామంలోని వర్గ విభేదాలు మొదలై ఆస్తి నష్టం చేసుకుని పరిస్థితికి వచ్చినాయి అని ఆదినారాయణ రెడ్డికి జరిగిన నష్టాన్ని కేసు నమోదు చేయడానికి ఐ విట్నెస్ లేనందున వాటిని టెక్నికల్ గా తీసుకొని అతనికి జరిగిన సంఘటనపై తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటిని త్వరలోనే చేదిస్తామని ఆయన తెలిపారు ,ఆయన సందర్భంగా మాట్లాడుతూ నాగభూషణ రెడ్డి గ్రామంలో అశాంతిని రేకెత్తిస్తున్నాడని ఎమ్మెల్యే మీద వ్యతిరేకం చేస్తూ మా అమాయకుల మీద ఇలా చిల్లర పనులు చేయిస్తూ నష్టానికి కారకుడు అవుతున్నాడని గ్రామంలో జరిగే ప్రతి చర్యకు నాగభూషణ్ రెడ్డి బాధ్యుడని అతని మీద అనేక అవినీతి ఆరోపణలు కేసులు ఉన్న వాటిని అన్నింటిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా తన వర్గ మనుషులను రెచ్చగొట్టడం గ్రామంలో వర్గ పోరు పెంచి పోషించడం అతనికి సర్వసాధారణంగా మారిందని అతనినీ కట్టడి చేయకపోతే గ్రామాలలో అశాంతి నెలకొంటుందని ఇలా రాను రాను ఫ్యాక్షన్ మొదలయ్యే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అది పోలీసులకు వివరించానని ఆదినారాయణ రెడ్డి తెలిపారు, ఆయనతోపాటుగా నాగరాజు, నాగేంద్ర ,సూరప్ప, నరసప్ప, శివన్న, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img